![]() |
![]() |

-కుప్పకూలిపోయిన హీరో గోవిందా
-ఆరోగ్యం ఎలా ఉంది.
-అభిమానుల కంగారు
-గోవిందా స్నేహితుడి ప్రకటన
బాలీవుడ్ కి సరికొత్త డాన్స్ ని, కామెడీ టైమింగ్ ని నేర్పిన హీరో 'గోవిందా'(Govinda). సాధారణంగా హీరో పేరుని ఎవరైనా పలకన్నా సదరు హీరో పేరు చెప్తారు. కానీ గోవిందా విషయానికి వచ్చే సరికి హీరో గోవిందా అని ఉచ్చరిస్తుంటారు. దీన్ని బట్టి గోవిందా కి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉన్న క్యాపబిలిటీని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా గోవిందా అస్వస్థతకి గురవ్వడం జరిగింది.
నిన్న అర్ధరాత్రి తన నివాసంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహటిన కుటుంబసభ్యులు హాస్పిటల్ కి తరలించారు. ఈ విషయంపై గోవిందా స్నేహితుడు లలిత్ బిందాల్ జాతీయ మీడియా తో మాట్లాడుతు గోవిందా కి ముంబై జుహులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతుంది.ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపాడు.
also Read: నాగార్జున పై అర్ధరాత్రి మంత్రి కొండ సురేఖ సంచలన ట్వీట్
1986 సినీ రంగ ప్రవేశం చేసిన గోవిందా తన కెరీర్ లో సుమారు 140 చిత్రాల వరకు చేసాడు. వాటిల్లో ఎక్కవ శాతం హిట్స్ ఉన్నాయి. చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనపడిన చిత్రం రంగీలా రాజా. డ్యూయల్ రోల్ లో కనిపించగా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి 2004 నుండి 2009 వరకు ముంబై నార్త్ నియోజకవర్గం నుండి ఎంపి గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 'శివసేన' పార్టీ లో కొనసాగుతున్నారు. వయసు 61 సంవత్సరాలు.
![]() |
![]() |